డోన్: బేతంచెర్ల లో చౌడేశ్వరి మాతకు వర్షాలు కురవాలంటూ 108 బిందెలతో జలాభిషేకం
Dhone, Nandyal | Jun 30, 2026 బేతంచెర్ల కొలుములపల్లె రహదారిలోని చౌడేశ్వరి మాత ఆలయంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని పట్టణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జలాభిషేకం నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన రైతులు 108 బిందెల పుణ్యజలంతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం పంచామృతాభిషేకం, కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం చేసి, మహా మంగళహారతితో ప్రత్యేక పూజలు ముగించారు.