గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లికి చెందిన విజయ రాజు అనే యువకుడు డోన్ దగ్గర జరిగిన ప్రమాదంలో మృతి
నంద్యాల జిల్లా డోన్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన విజయ రాజు అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని ఆర్టీసీ బస్టాండ్ లో స్టాల్ నిర్వహించే గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన విజయరాజు పని నిమిత్తం ద్విచక్రవాహనంలో డోన్ కు వెళ్ళాడు. అయితే డోన్ శివారులో జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో విజయ రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.