సంతనూతలపాడు: అధైర్య పడొద్దు... అండగా నేనున్నా ! మరియమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ
పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ' నేను అండగా ఉంటాను ' అని ముందుకు వచ్చారు జిల్లా కలెక్టర్ (ఇన్చార్జి) ఆర్.గోపాలకృష్ణ. ' మీ కుటుంబ సర్వతోముఖాభివృద్ధికి బాసటగా నిలుస్తాను ' అని భరోసా ఇచ్చారు. సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదప్రజలకు, పై స్థాయిలో సంపన్నులుగా ఉన్న 10% ప్రజలు అండగా నిలిచేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పథకం పీ - 4లో భాగంగా వ్యక్తిగతంగా తాను కూడా పేదలకు అండగా నిలుస్తాను అంటూ ముందుకు వచ్చారు గోపాలకృష్ణ !