సంగారెడ్డి: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న స్వచ్ఛత ఉత్సవాలను విజయవంతం చేయాలి : సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న స్వచ్ఛత ఉత్సవాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య. పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో స్వచ్ఛత ఈ సేవ 2025 స్వచ్ఛత ఉత్సవ్ గోడపత్రికను కలెక్టర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ డి ఆర్ వో లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పట్టణాల్లో పారిశుద్ధంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛత ఉత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూడాలన్నారు. సోషల్ మీడియా క్షేత్రస్థాయిలో డిజిటల్ ప్లాట్ఫారంలో స్వచ్ఛత ఉత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.