ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో క్రేన్ ఢీకొని వ్యక్తి మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోనీ నంద్యాల రహదారిలోని శిల్పాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ గుండం గ్రామానికి చెందిన మున్నయ్య మృతి చెందాడు, అతను వ్యక్తిగత పని మీద నడుచుకుంటూ వెళుతుండగా శిల్పాలను తరలిస్తున్న భారీ క్రేన్ ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు, సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు