బనగానపల్లె: బనగానపల్లెలో ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి 333 వ ఆరాధన
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని నేలమఠంలో ఆదివారంశ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి శ్రీనివాసచార్య స్వామి మాట్లాడుతూ.. స్వామివారు 1693లో సజీవ సమాధి పొందినట్లు తెలిపారు. ఆరాధనలో భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు, వీర కాలికాంబదేవికి అభిషేకాలు, అలంకరణలు చేశారు. సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు, పల్లకి సేవ కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నార.