బోయిన్‌పల్లి: మాన్వాడ గ్రామ సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయిన్పల్లి మండలం, మాన్వాడ గ్రామ సమీపంలో ట్రాక్టర్ ద్విచక్ర వాహనదారుడిని వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటన శుక్రవారం 10:00 PM కి చోటుచేసుకుంది,సిరిసిల్ల కు చెందిన నాగరాజు ద్విచక్ర వాహనంపై కరీంనగర్ వెళ్లి తిరిగి సిరిసిల్లకు వెళ్తుండగా, మాన్వాడ గ్రామం సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది,దీంతో రోడ్డుపై పడిపోయిన నాగరాజుకు ఎడమ కాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి, స్థానికుల సహాయంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,