రాజేంద్రనగర్: అల్కాపురి టౌన్షిప్ లో రోడ్డు ప్రమాదం
పుప్పాలగూడ పరిధి అల్కాపురి టౌన్షిప్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే నవీన్, తన కుమారుడు కుశల జోయల్తో కలిసి వస్తుండగా ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు