నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రంలో పెళ్లిళ్ల సందడి
Nandyal Urban, Nandyal | May 8, 2026
శుభముహూర్తాల నేపథ్యంలో మహానంది క్షేత్రం వివాహాలతో కళకళలాడుతోంది. శుక్రవారం పదుల సంఖ్యలో జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. బంధుమిత్రుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివాహానంతరం నూతన దంపతులు మహానందీశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.