కరీంనగర్: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ముందు కారు బీభత్సవం, మద్యం మత్తులో రాంగ్ రూట్ కారు
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆంధ్ర బ్యాంక్ ముందు కాంక్రీట్ జెర్సీ (తాత్కాలిక డివైడర్) ను సోమవారం ఓ కారు వేగంగా ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారు తో కమాన్ వైపు నుంచి వచ్చి రోడ్డు మధ్యలో కాంక్రీట్ జెర్సీ ని ఢీకొట్టడంతో కారు ముందు బాగా కాంక్రీట్ జెర్సీలో ఇరుక్కుపోయింది. స్థానికులు కారును బయటకు తీయడంతో , అధిక స్పీడ్ తో అక్కడి నుంచి కారుని తీసుకొని వెళ్లే క్రమంలో పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు నుంచి రాంగ్ రూట్ లో తెలంగాణ చౌక్ వైపు వెళ్లిపోయాడు. రాంగ్ రూట్ లో కారు వెళ్లే సమయంలో డీసీఎం వాహనం ముందు నుంచి వెళ్ళాడు.