నంద్యాల అర్బన్: నంద్యాలలో ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకులు
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుతం అమలులో ఉన్న మెస్ ఛార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదని చెప్పారు. వాటిని నెలకు రూ.3వేల వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.