జిల్లాలో యూరియా కొరత పై అరకులోయ తహసిల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
అల్లూరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ చైర్మన్ పాంగి గంగాధర్ ఆధ్వర్యంలో అరకులోయ మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద యూరియా కొరత పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి నిరసన కార్యక్రమం సోమవారం సాయంత్రం చేపట్టారు. అనంతరం తహసిల్దార్ కివినతి పత్రాన్ని అందజేశారు.