స్మార్ట్ రేషన్ కార్డులతో బహుళ ప్రయోజనాలు: రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు
స్మార్ట్ రేషన్ కార్డులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని హౌసింగ్ బోర్డు ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు అన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డులతో రేషన్ సరకుల పంపిణీ మరింత సులభతరం అవుతుందన్నారు. అవినీతికి తావు లేకుండా పంపిణీ జరుగుతుందన్నారు. స్మార్ట్ కార్డులను ఇతర ప్రభుత్వ పథకాలకు ఐడెంటిటీగా ఉపయోగించుకోవచ్చు అన్నారు.