నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
Nandyal Urban, Nandyal | Apr 9, 2026
జొన్న, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తేదీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ అన్నారు. గురువారం నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు జొన్నలు, మొక్కజొన్నలు పోసి ధర్నా చేశారు.జిల్లాలో 72 వేల ఎకరాల్లో జొన్న, 1.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారన్నారు. ప్రభుత్వం చొరవతీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు