ఒంగోలు అర్బన్: మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డం పెట్టుకొని మోడీ, అమిత్ షా కుట్రలు: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ షేక్ సైదా
Ongole Urban, Prakasam | Apr 25, 2026
మహిళా బిల్లుతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు చేశారంటూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ షేక్ సైదా అన్నారు. శనివారం సోషల్ మీడియా ద్వారా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన కూటమి ప్రభుత్వంపై విరుచుకోపడ్డారు. 2023 సంవత్సరంలోనే ఆమోదం పొందిన మహిళ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని బిజెపిని ప్రశ్నించారు. మహిళా బిల్లు పేరుతో శాశ్వతంగా అధికారంలో ఉండాలని మోదీ, అమిత్ షా కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక చంద్రబాబు నాయుడు మహిళా బిల్లు వ్యతిరేకించిన పార్టీలను ఎండ కొడుతూ వచ్చే నెల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామనడం హాస్యాస్పదమని అన్నారు.