కేసముద్రం: కే సముద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టిన ఎమ్మెల్యే మురళి నాయక్
కేసముద్రం మండల పరిధిలోని 84 మంది నిరుపేదలైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ మరియు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది,ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళినాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని, లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఇందిరమ్మ పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాలు ఎంతో మంది పేదలకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కలిగించనున్నయని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.