తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కార్పొరేట్ పాఠశాల బస్సులపై నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు ఆర్టీవో అనిల్ కుమార్ తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేటలోని హోలీ క్రాస్ సర్కిల్లో 28 బస్సులను పరిశీలించి చిన్నపాటి లోపాలపై మొదటి హెచ్చరిక జారీ చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యాలు పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.