డోన్: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డోన్ లో అవగాహన ర్యాలీ
Dhone, Nandyal | May 16, 2026 నంద్యాల జిల్లా డోన్లో మున్సిపాలిటీ పరిధిలోని UPHC పాతపేట, UPHC రోకలిబండ సత్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికున్జున్యా వంటి వ్యాధుల నివారణపై ప్రజలకు సూచనలు చేశారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, ట్యాంకులు, డ్రమ్ములు, తోట్లు మూతపెట్టాలన్నారు. ప్రతీ శుక్రవారం "ఫ్రైడే డ్రైడే" పాటించి, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.