ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ పై వైసీపీ మూకల దాడిని ఖండించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
Ongole Urban, Prakasam | Apr 7, 2026
అమరావతి అంశంపై ప్రశ్నించినందుకే మీడియాపై దాడి చేయడం దుర్మార్గమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ విమర్శించారు వైసీపీ రౌడీ మొక్కలు హైదరాబాదులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి చేయటాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత మీడియా అడ్డుపెట్టుకుని వైసిపి అనైతిక చర్యలకు పాల్పడుతుందని ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై దూషణలు చేయడం దారుణం అన్నారు కేసులు దాడులు ఒత్తిళ్లకు భయపడకుండా దశాబ్దాల ద్వారా రాధాకృష్ణ మీడియా సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు మీడియా స్వేచ్ఛపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు