గుంటూరు: కారుణ్య నియమక ఉత్తర్వును అందించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
Guntur, Guntur | Sep 22, 2025 సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలసి కారుణ్య నియమకాలకు సంబంధించి వి.అశోక్ ను సోషల్ వెల్ఫేర్ శాఖలో టైపిస్ట్ గా నియమిస్తూ జారీ చేసిన నియామక ఉత్తర్వులను అందించారు. కారుణ్య నియామకం పొందిన అభ్యర్ది ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే.స్ ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, డీడీ సోషల్ వెల్ఫేర్ యు.చెన్నయ్య పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.