అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, గుత్తి చైర్ పర్సన్ వన్నూరుబీ, గుత్తి ఎంపీపీ విశాలాక్షి పాల్గొని సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైసీపీ పోరాటం ఆపదన్నారు.