ఆత్మకూరు: అమరచింత:పెట్టుబడి, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడి సోషలిజం సమాజం కోసం ముందుకు రావాలి...సీపీఐ జాతీయ నాయకులు యూసఫ్
పెట్టుబడి దారి దోపిడి భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడి సోషలిజం సమాజం కోసం ముందుకు రావాలని సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి యూసుఫ్ పిలుపునిచ్చారు.శనివారం అమరచింత మండల పరిధిలోని కొంకన్వానిపల్లి గ్రామంలో ప్రారంభమైన సిపిఐ నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉదయం మానవ పరిణామం, మధ్యాహ్నం మార్క్ ఈస్ట్ మూల సూత్రాలు అనే అంశాలపై ఆయన మాట్లాడుతూ దోపిడీ పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాలు పెట్టుబడిదారునికి యజమానికి ఉంటుందని ఆయన అన్నారు.