ఒంగోలు అర్బన్: సెప్టెంబర్ లోగా నిర్మాణంలో ఉన్న అన్ని ఇళ్లను పూర్తి చేయాలి: ఏపీ ఎస్ హెచ్ సి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్
Ongole Urban, Prakasam | Jun 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా హౌసింగ్ కార్యాలయం లో APSHCL మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్ బాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.సమావేశంలో గృహ నిర్మాణ లక్ష్యాలు, సాధించిన పురోగతి, పీపీపీ మరియు పీఎంఏవై-యు 2.0 కార్యక్రమాల అమలు పురోగతిపై విపులంగా సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని, పనుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు మేనేజింగ్ డైరెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.