ఎడపల్లి: కుల బహిష్కరణ చేశారంటూ కోటగిరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్షకు దిగిన ఓ కుటుంబం
కోటగిరి మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ కుటుంబం దీక్ష చేపట్టారు. కోటగిరి గ్రామానికి చెందిన స్వాతి తన కుటుంబంతో అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష చేపట్టారు. మాల కులానికి చెందిన తమను సంఘం వారు కుల బహిష్కరణ చేశారని ఎలాంటి కార్యక్రమాలకు తమను పిలవడం లేదని, తమ ఇంట్లో శుభము, అశుభము జరిగినా ఎవరూ రావడం లేదని ఆరోపించారు. బాధ్యులపై కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు స్వాతి వెల్లడించారు.