బనగానపల్లె సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్.
బనగానపల్లె: అవినీతి అధికారి సస్పెండ్ అయిన ఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా రొద్దం మండలం రొద్దకంపల్లెలోని 16.80 ఎకరాలకు బనగానపల్లె సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్త ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఇది ప్రభుత్వ భూమిగా తేలింది. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో శనివారం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు.