డోన్: డోన్ లో ఏపీ జేపీఎస్ లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 14, 2026 ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి (ఏపీజేపీఎస్) లోగోను డోన్లో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. సమాజంలో ప్రజలకు నిజమైన సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా బాధ్యత ఎంతో ముఖ్యమైందని, జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పరిరక్షణ సమితి మరింత బలోపేతం కావాలన్నారు.