ఒంగోలు అర్బన్: త్వరలో పట్టణ పేద ప్రజలకు ఒక్క రూపాయి కే టిట్కో గృహం: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Apr 26, 2026
త్వరలో మొదటి విడతలో 3792 కుటుంబాలకు టిడ్కో గృహాలు సీఎం చంద్రబాబు చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తాం అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు ఆదివారం ఒంగోలు నగరంలోని కొప్పోలు పరిధిలో టిడ్కో పనులు పునఃప్రారంభించిన సందర్బంగా అధికారులు మరియు నిర్మాణ సంస్థలతో కలిసి పరిశీలించడం జరిగినది. జరుగుతున్న పనుల పనితీరు గురించి నిర్మాణ సంస్థలతో మాట్లాడటం జరిగినది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని చింతల మరియు కొప్పోలు ప్రాంతాల్లో పేదల కోసం ఏకంగా 3792 గృహాలను జీ+3 పద్ధతిలో నిర్మిస్తున్నాము అన్నారు