అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం నుండి సాయంత్రం 4:30 గంటల వరకు స్కూల్ గేమ్స్ లో భాగంగా మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తి డివైఈవో మల్లారెడ్డి పాల్గొని పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులు కళ్యాణదుర్గంలో జరిగే డివిజనల్ పోటీల్లో పాల్గొంటారని డివై ఈవో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పీడీలు గోపాల్ రెడ్డి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.