పెద్దఅంబర్‌పేట ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం కారణంగా పొగలు వెలుబడ్డాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఈ బస్సు టైర్లు ఓవర్‌హీట్ అవ్వడంతో పొగలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పైనే బస్సు ఆగిపోవడంతో అందులో ఉన్న 26 మంది ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు.