నిజామాబాద్ సౌత్: సెప్టెంబర్ 17న తెలంగాణకు విద్రోహ దినమే న్యూ డెమోక్రసీ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
సెప్టెంబర్ 17న తెలంగాణకు విద్రోహ దినమేనని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య అన్నారు. నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. భూస్వాములకు, పటేళ్లకు, పట్వారీలకు వ్యతిరేకంగా భూ పోరాటం చేశామన్నారు. భారత ప్రభుత్వం సైనిక చర్య పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించిందన్నారు