మంత్రాలయం : మంత్రాలయం గ్రామదేవత మంచాలమ్మ, మారికాంబ, దుర్గాదేవికి గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బుధవారం కుంబాలు సమర్పించారు. దేవర మహోత్సవాన్ని పురస్కరించుకొని పూజారి నీలకంఠ గౌడ్ ఇంటి నుంచి బోనాలు, కళాశాలు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. అంతరం బండారూ చల్లి మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ఉన్నారు.