పెంచిన రొయ్యల ఫీడ్ ధరలను తగ్గించాలని ఆక్వా రైతుల ధర్నా
Ongole Urban, Prakasam | May 12, 2026
రొయ్యల ఫీడ్ ధరలు అమాంతం పెంచడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు మత్స్య శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఫీడ్ కంపెనీలు ములాఖత్ అయ్యి ప్రభుత్వం తీసుకు వచ్చిన అప్సడ చట్టాన్ని అతిక్రమించి ఫీడ్ ధరలను రాత్రికి రాత్రే అమాంతం పెంచడాన్ని రైతులు తీవ్రంగా ఖండించారు. టైగర్ రొయ్య ఫీడ్ కిలో కు రూ10-50పై,వెనామి ఫీడ్ రూ 8-40 పైసలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. పెరిగిన ఫీడ్ ధరల వల్ల రైతుకు ఒక కిలో రొయ్యలు పండించడానికి 40 రూపాయల అదనపు ఖర్చు అవుతున్నదని వాపోతున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు తీసుకురావాలని డిమాండ్ చేశారు