లక్కిరెడ్డిపల్లి:రోడ్డు ప్రమాదం బైక్ బోల్తా వ్యక్తికి తీవ్ర గాయాలు
రాయచోటి–వేంపల్లి ప్రధాన రహదారిపై మద్దిరేవుల వంక బ్రిడ్జి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్థానికుడైన వెంకటరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వెంకటరాజు అదుపు తప్పి బైక్‌తో బోల్తా పడ్డాడు. ఘటనలో తలకు, చేతులకు గాయాలైన ఆయనను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.