ఒంగోలు అర్బన్: గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చేర్చకు సిద్ధమని సవాలు విసిరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jun 29, 2026
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైసిపి నాయకులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సవాలు విసిరారు. సోమవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పక్క నియోజకవర్గంలో నుంచి వచ్చిన నాగార్జున రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో రోడ్లు ఎలా వేసానో వచ్చి చూడాలని తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పనికొచ్చే విమర్శలు చేయాలని సలహాలు ఇస్తే స్వీకరిస్తారని అన్నారు. అవసరమైతే అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు కలిసి ఇద్దరం వెళ్దామని అన్నారు.