లక్కిరెడ్డిపల్లి: దొరుచూరులో స్కూటర్ ప్రమాదం – వ్యక్తికి తీవ్ర గాయాలు
లక్కిరెడ్డిపల్లి మండలం దొరుచూరు వద్ద ఆదివారం స్కూటర్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మదనపల్లికి చెందిన ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారమివ్వగా, గాయపడిన వ్యక్తిని లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మరింత చికిత్స కోసం పరిశీలిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.