జిల్లాలో అసాంఘిక కార్యకలాపలపై ఉక్కు పాదం, మార్చిలోనే ఏకంగా 11,000 మందికి పైగా విచారించాం ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 1, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో మార్చి నెలలో పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. 11,741 మంది అనుమానితులను తనిఖీ చేసి 18 మందిని గుర్తించారు. గంజాయి కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేసి 24 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. జూద కార్యకలాపాలపై దాడుల్లో 179 మందిని అదుపులోకి తీసుకుని రూ.4.55 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.