కొత్తపేట మండలంలోని బోడిపాలెం వంతెన వద్ద ప్రమాదకరంగా మారిన కరెంటు తీగ
కొత్తపేట మండలంలోని బోడిపాలెం వంతెన వద్ద అన్యం వెంకన్న వీధిలో కరెంటు తీగ ప్రమాదకరంగా కిందికి వేలాడుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరెంటు వైరు తలకు తగిలేలా వేలాడుతోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కావున తక్షణమే విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి విద్యుత్ తీగలను సరిచేయాలని కోరుతున్నారు.