నంద్యాల అర్బన్: అక్రమ మట్టి తవ్వకాలకు,నాకు సంబంధం లేదు: నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
Nandyal Urban, Nandyal | May 23, 2026
నంద్యాల మండలం కానాల గ్రామ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల వ్యవహారంలో తన పేరు అనవసరంగా లాగడం దారుణమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పేర్కొన్నారు. మట్టి తవ్వకాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు తమ కార్యకలాపాలకు రాజకీయ రంగు పులిమేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు ఈ విషయంపై విచారణ చేయాలన్నారు.