ఒంగోలు అర్బన్: ఒంగోలు మొబైల్ కోర్ట్ ఏఎన్ఎం కోర్టు ప్రాపర్టీ రూముల తలుపులను పగలగొట్టిన దొంగలు, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
Ongole Urban, Prakasam | May 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కోర్టులో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కోర్టు ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు సెకండ్ ఏఎంఎం కోర్టు, మొబైల్ కోర్టు ప్రాపర్టీ రూమ్ల తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కోర్టు కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు గల బీరువాలను దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.