గాంధారి: రైతు వేదికలో వరద బాధితులు 67 మందికి కిట్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో అందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం వరద బాధితులకు ఊరటనిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరద బాధితులు 67 మందికి దుప్పట్లు, బెడ్షీట్లు, చీరలు, దొవతులు, టవల్స్ తో కూడిన కిట్లను ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మరియు ఇతర ఆపద సమయంలో ఇండియన్ రేస్ కార్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయం అందిస్తుందని అన్నారు.