డోన్: మల్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరికీ గాయాలు
Dhone, Nandyal | May 22, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం మల్కాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వారు లాల్మన్పల్లెకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన డ్రమ్ములను బైకుతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.