ఈనెల 10వ తేదీన అద్దంకి నియోజకవర్గం ,మేదరమెట్ల గ్రామ సమీపంలో జరగనున్న " *సిద్ధం* "4 వ మహా సభకి సంబంధించి పర్చూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దశ,దిశ నిర్దేశాన్ని పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి యడం బాలాజీ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నియోజకవర్గ ఇన్చార్జి బాలాజీ మాట్లాడుతూ సిద్ధం మహాసభను వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు వేలాదిమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.