ప్రతి రైతు పంట పండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా తెలుగు గంగా రిజర్వాయర్ ద్వారా నీటి పంపిణీతో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. మంగళవారం తెలుగు గంగా 5వ బ్రాంచ్ కాలువకు జలహారతి, సాగునీటి విడుదల కార్యక్రమాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, గూడూరు పాశం సునీల్ కుమార్ సంయుక్తoగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ 5వ బ్రాంచ్ కాలువ నీటి విడుదలతో ఓజిలి మండలానికి అధిక లబ్ధి లభిస్తోందని, మొత్తం 28 MI ట్యాంకులు నిండిపోతాయన్నారు. దాంతో 4,600 ఎకరా