తణుకు: రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
గత కోన్నేళ్లుగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా గోస్తనీ ఆనుకుని బండ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా బండ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకు తోడు విద్య, వైద్యం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.