డోన్: ప్యాపిలి మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం,, ఒకరు దుర్మరణం
Dhone, Nandyal | May 13, 2026 నంద్యాల జిల్లాప్యాపిలి మండలం వెంగళంపల్లె చెరువు కట్ట సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన జేసీబీ ఇంట్రా టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీ కొట్టింది. మ్యాజిక్ వాహనంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరికొందరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.