ఒంగోలు అర్బన్: ఒంగోలులోని దశరాజు పల్లి గ్రామంలో ఎమ్మెస్ ఎం ఇ పార్క్ ను ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
Ongole Urban, Prakasam | May 25, 2026
ఒంగోలు పట్టణంలోని దసరాజు పల్లి గ్రామంలో సోమవారం ఎంఎస్ ఎంఈ పార్కును కలెక్టర్ రాజాబాబు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. మినీ ఇండస్ట్రియల్ ప్రోత్సాహం కొరకు ఐదు ఎకరాలలో ఈ పార్కు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాలలో ఎంఎస్ ఎంఈ పార్కులను ప్రారంభించినట్లు కలెక్టర్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా సీఎం చంద్రబాబు దూసుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు.