గుంతకల్లు: లచ్చానపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం: బైక్ అదుపు తప్పి బోల్తా, వ్యక్తికి తీవ్ర గాయాలు
గుత్తి మండలం లచ్చానపల్లి గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బైక్ను డ్రైవ్ చేస్తున్న ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. లచ్చానపల్లికి చెందిన ఆంజనేయులు బైకులో గుత్తికి వెళుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన ఆంజనేయులు గుత్తి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.