ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టడంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది, పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అధికారులు కొరత లేదని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇటీవల జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ఇంధనం నిల్వలు తగ్గడంతో పెట్రోల్ బంకులు ఖాళీ అయినా ఘటనలు చూసాం