బనగానపల్లె: కోవెలకుంట్ల లో భారీ చోరీ రూ. 5 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల స్కంద కాలనీలో శుక్రవారం చోరీ జరిగింది. ఇంటికి తాళాలు వేసి, పెళ్లికి వెళ్లిన శ్రీనివాసులు ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. సుమారు రూ.5 లక్షల విలువైన వస్తువులు దొంగిలించినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.