నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఆసుపత్రిలోని పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. పొందపడకు ఆసుపత్రితో ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.